బండి సంజ‌య్ ప్రజా ప్రస్థానం యాత్రకు స్పంద‌న క‌రువు..!

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర మూడో విడ‌త ప్రారంభం అయింది.

ఈ యాత్ర ఐదు జిల్లాల్లోని 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ దాదాపు 328 కిలోమీట‌ర్లు.

24 రోజుల్లో పూర్తి చేయ‌నున్నారు.ఈ యాత్ర యాదాద్రిలో ప్రారంభ‌మై వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

అయితే ఈ జిల్లాలో నిర్వ‌హించిన యాత్ర‌కి స్పంద‌న క‌రువైంద‌ని అంటున్నారు.ఈ జిల్లాలో కొందరు అడిగిన ప్రశ్నలకు బండి సమాధానం చెప్పలేకపోయాడట.

దీంతో బండి ప్రాబల్యం తగ్గుతోందని అంటున్నారు.కేవలం కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా బండి సంజయ్ పనిచేస్తున్నాడా.

? అని అడుతున్నారు.ధరల మోత.

నిరుద్యోగ సమస్యతో తెలంగాణ ప్రజానీకం అల్లాడిపోతోంది.ఈ సమస్యల పరిష్కారానికి దారి చూపండి అంటూ బండి సంజ‌య్ ని అడుగుతున్నార‌ట‌.

ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో బండికి వ్య‌తిరేక‌త ఎదురైంద‌ని అంటున్నారు.

పాద‌యాత్ర‌లో ప్ర‌శ్న‌లు. """/"/ మూడో పాదయాత్రను యాదాద్రి నుంచి మొదలు పెట్ట‌గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ టీఆర్ఎస్ బలంగా ఉంది.

దీంతో ఆయా పార్టీలకు సంబంధించిన వారు బండి సంజయ్ ను ప్ర‌శ్నిస్తున్నార‌ట‌.అయితే కేసీఆర్ ను తిట్టడం తెలిసిన బండి సంజయ్ కి బీజేపీ వస్తే ఏం చేస్తుందో చెప్పలేకపోతున్నార‌ని అంటున్నారు.

ఇప్పటి వరకు బీజేపీ నిర్వహించిన ఏ సమావేశాల్లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడం లేద‌ని అంటున్నారు.

ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందోని చెబుతున్నాడే తప్ప దానికి ప్ర‌త్యామ్నాయంగా త‌మ పార‌ట్ఈ త‌ర‌పున ఏం చేయాల‌నుకుంటున్నాడో చెప్ప‌లేక‌పోతున్నాడ‌ట‌.

అయితే నల్గొండ జిల్లాలో ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పాదయాత్ర నిర్వహించింది.ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కోసం జనం బాగానే వచ్చారు.

కానీ బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు అంతకంటే తక్కువగానే జ‌నం వస్తున్నారని అంటున్నారు.

దీంతో షర్మిల పార్టీ కంటే బీజేపీకి ఆద‌ర‌ణ క‌రువైందా.అంటున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని అంటున్నారు.ఇక మునుగోడులో టీఆర్ఎస్ తనకు పోటీగా కాంగ్రెస్ అంటోంది.

బీజేపీని లెక్కలోకి తీసుకోవడం లేదు.అటు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా ఫలితం ఉండే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో బండి యాత్ర‌కు సెగ‌లు త‌గులుతుండ‌టంతో చర్చనీయాంశంగా మారింది.ఇప్ప‌టికైనా బండి తామ పార్టీ ఏం చేయ‌ల‌నుకుంటుందో చెప్తే బాగుంటుంద‌ని అంటున్నారు.