టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

టీఎన్జీవో నేతలపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నలుగురు టీఎన్జీవో నేతల స్వార్థానికి ఉద్యోగులు బలయ్యారని తెలిపారు.టీఎన్జీవో నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పేది లేదని పేర్కొన్నారు.

వారిని ఎప్పుడూ తిడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.టీఎన్జీవో నాయకులే ఉద్యోగులకు పొర్లు దండాలు పెట్టాలని వ్యాఖ్యనించారు.

ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ఒక్కసారైనా అడిగారా అని ప్రశ్నించారు.317 జీవోకు వ్యతిరేకంగా పోరాడి ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లినట్లు తెలిపారు.

మీ పీఆర్సీ కోసం మేం కొట్లాడామని వెల్లడించారు.ఉపఎన్నిక సందర్భంగా ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు.

తాత్కాళిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్మికులు బలికావొద్దని చెప్పారు.వచ్చే నెల నుంచి ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

తనికెళ్ల భరణి రెమ్యూనరేషన్ విషయంలో ఇలా ప్రవర్తిస్తాడని ఎవరు ఊహించలేరు