ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన ఆదరణ చూసి బండి సంజయ్ కు మతి భ్రమించింది

ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చిన ఆదరణ చూసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మతి భ్రమించింది మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.

బండి మాటలో అర్థం పర్థం లేదని కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించడమే బండి సంజయ్ పని ఇరుకు గల్లీలో పెట్టుకునే ప్రజా సంగ్రామ సభలో ఎంత మంది ఉంటున్నారని ఎద్దేవా ప్రజల కోసం బండి సంజయ్ కేంద్రం నుంచి ఏం తెచ్చారు.

ప్రధాని మోదీ 8 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, ఏం చేయబోతున్నారో చెప్పుకోవాలని హితవు.

మతి భ్రమించి అర్థరం పర్థం లేని మాటలు మాట్లాడవద్దని మంత్రి వేముల సూచించాన ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ చూడలేదన్నారని తెలిపారు.

తన కంటికి ఎంత దూరం కనిపిస్తుందో అంతదూరం కంటే ఎక్కువే జనాలు ఉన్నారని చెప్పారన్నారు.

బండి సంజయ్ కు అది కనిపించకపోవడం దురదృష్టకరం.భవిష్యత్ లో బీఆర్ఎస్ సభ ఎక్కడ జరిగినా ఇలాగే ఉంటుందన్నారు.

రైతులకు ఉచిత కరెంట్ గురించి బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

దానిమ్మ తొక్కలతో ఇలా చేశారంటే మచ్చలేని చర్మం మీ సొంతం!