వరంగల్ నిరుద్యోగ మార్చ్ లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి హిందీ పేపర్ లీకేజ్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నీ ( Bandi Sanjay ) A1గా చేర్చడం జరిగింది.

ఈ క్రమంలో అరెస్టు అయిన బండి సంజయ్ బెయిల్ పై బయటికి వచ్చాక.

అన్యాయంగా తనపై కేసు పెట్టారని కుట్రపూరితంగా వ్యవహరించారని తెలంగాణ ప్రభుత్వం పై పోలీస్ శాఖ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా వరంగల్ లో( Warangal ) నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ లో( Nirudyoga March ) బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 మీ తప్పు లేకుంటే పదవ తరగతి పేపర్ లీకేజ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని చాలెంజ్ చేశారు.

"""/" / ఇదే సమయంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

30 లక్షల మంది యువత కోసం తాము కోట్లాడుతున్నట్లు తెలిపారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు చనిపోతే కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించడం జరిగింది.

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కి నిరుద్యోగులు గుర్తొస్తారని విమర్శించారు.TSPSC పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ను భర్త ఆఫ్ చేయాలన్నారు.

ఈనెల 21 పాలమారు గడ్డపై నిరుద్యోగ మార్చ్. """/" / ఆ తర్వాత పది ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్.

హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ జరపనున్నట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది.

ఎన్నికలు వస్తే చాలు ఆంధ్ర.తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం కేసీఆర్ చేస్తారని విమర్శించారు.

కేసీఆర్ పెట్టిన సిట్ లు ఏ కేసును తేల్చలేదని చెప్పుకొచ్చారు.ఎన్నికల ముందు కేసీఆర్ కి మహనీయులు గుర్తుకొస్తారని అందువల్లే ఫస్ట్ టైం అంబేద్కర్ జయంతి వేడుకల్లో నిన్న కేసీఆర్ పాల్గొన్నారు అని బండి సంజయ్ విమర్శించారు.

బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యేది అప్పుడే.. కంటెస్టెంట్స్ వీళ్లే..??