ఏపీ బాధ్యతలు బండి సంజయ్ స్వీకరించినట్టే గా ?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శక్తిసమర్ధ్యాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ పార్టీ రాష్ట్ర నాయకులకే కాదు, కేంద్ర బీజేపీ పెద్దలకు సంజయ్ శక్తిసామర్థ్యాలు అర్థం అయిపోయాయి.

గ్రేటర్ దుబ్బాక ఎన్నికల ఫలితాలతో సంజయ్ శక్తిసామర్థ్యాలు ఇట్టే అందరికి అర్ధం అయ్యాయి.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ బాగా బల పడుతుంది అనే నమ్మకం ఆ పార్టీ నాయకులలోనూ బాగా ఏర్పడింది.

సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ రాజకీయ ఎదుగుదలపై ఏ సందేహాలు లేవు.కానీ తెలంగాణలో మాదిరిగా బీజేపీ బలం లేకపోవడం ,పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటికీ బలహీనంగా ఉండడంతో బీజేపీ అగ్రనేతలు ఏపీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఏపీ నాయకులతో పాటు, ప్రజలలోనూ బీజేపీ పై మరింత నమ్మకం ఏర్పడే విధంగా చేసేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించి, తిరుపతి లోక్ సభ ఎన్నికలలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బండి సంజయ్ లతో చర్చించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, తాజాగా ఏపీ ప్రభుత్వం వైసీపీ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని, బైబిల్ పార్టీ కావాలో.భగవద్గీత పార్టీ కావాలో తెలుసుకోవాలని తిరుపతి ప్రజలకు పిలుపునిచ్చారు.

గ్రేటర్ దుబ్బాక ఎన్నికల ఫలితాలే తిరుపతిలో కూడా పునరావృతం కాబోతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు.

అలాగే ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు.వైసిపి రెండు కొండలు అంటోంది అని, ఏడుకొండలవాడ గోవిందా గోవిందా అనేది బిజెపి సిద్ధాంతమని, తిరుపతి ఉప ఎన్నికల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని అన్నారు.

వైసిపి ప్రభుత్వం మూటా ముల్లె సర్దుకునేలా తరిమి కొడతాం అన్నారు. """/"/ ఏపీ లో జరుగుతున్న దేవాలయాలపై దాడులకు జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాలి అని విమర్శించారు.

ఏపీలో సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బిజెపి పోరాటానికి సిద్ధమవుతోందని, తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు మరింత బలవంతులు అంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఆయన ప్రత్యేకంగా ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు గా అర్థమయిపోయింది.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ కి వెళ్ళన సందర్భంగా అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో సంజయ్ ఏపీ రాజకీయాలపై యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తోంది.

2025 లో మెగా హీరోలు తమ సత్తా చాటబోతున్నారా..?