సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది.తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు.

లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్ రెడ్డి చేసిన సవాల్‌కు నేడు చండూరులో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్పందించాలని, ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో సంజయ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు తెరాస ఎన్ని డ్రామాలకైనా తెరతీస్తుందని విమర్శించారు.

ఓటర్లను కొనుగోలు చేసేందుకు సీఎం కాన్వాయ్ లోనే డబ్బు తరలిస్తారని సంజయ్ ఆరోపించారు.

10 రూపాయల టికెట్ కొని పుష్ప ది రూల్ చూశా.. నటి సంయుక్త షాకింగ్ కామెంట్స్ వైరల్!