Minister Ponnam Prabhakar : బండి సంజయ్ సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరతీశారు..: మంత్రి పొన్నం
TeluguStop.com
కరీంనగర్ లో( Karimnagar ) రాజకీయ వేడి కొనసాగుతోంది.బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
గత కొన్ని రోజులుగా బీజేపీ ఎంపీ బండి సంజయ్,( MP Bandi Sanjay ) కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.
"""/" /
బండి సంజయ్ సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరతీశారని విమర్శించారు.ఐదేళ్లలో కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు.
బండి సంజయ్ యాత్రకు ప్రచారం రావాలని అడ్డుకున్నట్లు డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు.బండి సంజయ్ యాత్రను తాము అడ్డుకోలేదని తెలిపారు.
ఇలా అయితే ఎలా అఖిల్.. తెలుగు వారియర్స్ రెండో ఓటమి