ఆ ప్రచారంలో బండి సంజయ్ టాప్ ! ఇప్పుడే అదే ట్రెండ్ ?

రాజకీయంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దూసుకుపోతున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి,  అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు.

గత కొద్ది రోజులుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తూ పట్టు పెంచుకుంటున్నారు.

సంజయ్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉత్సాహం పెరగడంతో పాటు,  టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బిజెపి బలపడింది.

దుబ్బాక,  హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ బిజెపి సత్తా చాటుకుంది.ఈ ఉత్సాహం ఇలా కొనసాగుతూ ఉండగానే మరో అంశంలో బండి సంజయ్ టాప్ పొజిషన్ లో నిలబడ్డారు.

  రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా పరంగా ప్రచారం నిర్వహించే రాజకీయ నాయకుల్లో సంజయ్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పొలిటికల్ న్యూస్ ట్రెండ్ బాగా పెరిగింది.

ముఖ్యంగా ఫేస్ బుక్, యూట్యూబ్ వంటివి వాడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది.

దీంతో రాజకీయ నాయకులంతా ఇప్పుడు సోషల్ మీడియా పైనే ఎక్కువ దృష్టి పెట్టారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటేనే తమకు ప్రజల్లో పరిచయాలు పెరిగి , తమ విజయానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.

ఈ విషయంలో అందరి కంటే ముందు వరుసలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిలుస్తున్నారు.

గత నెల రోజులుగా ఫేస్ బుక్ లో ఆయన ప్రచారం నిమిత్తం  4.

95 లక్షలను ఖర్చుపెట్టారు.  """/"/ ఫేస్ బుక్ కి ఇచ్చే ప్రకటనల్లో తెలంగాణ బిజెపి పెడుతున్న ఖర్చు దేశంలోనే ఐదవ స్థానంలో బండి సంజయ్ ని నిలబెట్టింది.

ఈ విధంగా బండి సంజయ్ వార్తల్లోకి ఎక్కారు.ఇదిలా ఉంటే 2019 నుంచి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను  ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి.

దీనికోసం 188 కోట్లు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ఫేస్ బుక్ లో ప్రచారం నిర్వహించేందుకు భారీగానే ఖర్చు పెడుతున్నారు.

ఇప్పుడు జనాలంతా సోషల్ మీడియా ను ఎక్కువ అనుసరిస్తూ ఉండడంతో.రాజకీయ నాయకులు ఇప్పుడు  అదే బాటలో నడుస్తున్నారు.

అయస్కాంతంతో ఫ్లైట్ ఎక్కాలని చూసిన పాకిస్థానీ వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..