మంత్రి కేటీఆర్‎కు బండి సంజయ్ కౌంటర్

మంత్రి కేటీఆర్ కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.దేవుడి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు అన్నారు.

తప్పు చేసిన వాళ్లు తడి బట్టలతో గుడిలోకి వెళ్లరని చెప్పారు.నిజంగా తప్పు చేయకపోతే కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ అపవిత్రమైందని తెలిపారు.

టీఆర్ఎస్ నేతలు తిరిగిన ప్రాంతాల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు.నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ లో ఎందుకు దాచిపెట్టారని నిలదీశారు.

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని బండి సంజయ్ సూచించారు.