బీజేపీలో చేరికల పై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. !
TeluguStop.com
తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ముఖ్యంగా హుజురాబాద్ నియోజక వర్గంలో మాత్రం రాజకీయం చాలా హీట్ ఎక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ నియోజకవర్గానికి టీఆర్ఎస్ తరపున రాజీనామా చేసే వరకు ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించేవారు.
కానీ ఈటల రాజీనామాతో ప్రస్తుతం గులాభి పార్టీకి ఈ నియోజక వర్గం ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇకపోతే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ తన నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని దూరం చేసుకుంటున్నారని, ఈ నేపధ్యంలో త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని, అదీగాక కొందరు ముఖ్యనేతలు బీజేపీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని, వీరి అక్రమాలకు అడ్దుకట్ట వేయాలంటే కమళంతోనే సాధ్యం అంటూ వెల్లడించారు.
నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ వైరల్!