కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత బండి సంజయ్ విమర్శలు చేశారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కొత్త ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేయొద్దని బండి సంజయ్ పేర్కొన్నారు.అప్పుందని చెప్పుకుంటూ కాలం వెళ్లదిస్తున్నారని విమర్శించారు.

డ్రగ్స్ కేసును తిరగదోడి ఎంత పెద్దవాళ్లున్నా బయటకు లాగాలని చెప్పారు.317 జీవోను సవరిస్తారా లేదా చెప్పాలన్నారు.

అలాగే నయీం ఆస్తులు బయటకు వస్తే 2, 3 జిల్లాలు బాగుపడతాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం అంశాన్ని సీబీఐ విచారణకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.

అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ ఎలా ఒక్కటో కూడా కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.

యూకే : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఉనికి కోసం కన్జర్వేటివ్‌లు పోరాడాల్సిందేనా..?