బీఆర్ఎస్ చేతగాని పార్టీ.. బండి సంజయ్

బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ చేతిగాని పార్టీ అన్న ఆయన బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ను గెలిపించాలని ఎంఐఎం చూస్తోందని బండి సంజయ్ తెలిపారు.ఈ నేపథ్యంలో ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ చేశారు.

ఓల్డ్ సిటీకి ఎంఐఎం పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు.ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందడం లేదని ప్రశ్నించారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ముకాస్తుందని ఆరోపించారు.

వారసుడి సినీ ఎంట్రీ గురించి వెంకీమామ క్లారిటీ ఇదే.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?