మంత్రి పొన్నంకు బండి సంజయ్ కౌంటర్..!!

బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఈ మేరకు మంత్రి పొన్నంకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.మాజీ మంత్రి కేటీఆర్ ను తిడితే పొన్నం ప్రభాకర్ కు ఎందుకు రోషం వస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఎవరి కోసం పొన్నం కరీంనగర్ వదిలి హుస్నాబాద్ కు వెళ్లారో తెలియదా అని ప్రశ్నించారు.

నిర్మాణాత్మకంగా మాట్లాడితే తమపై వ్యక్తిగత దూషణలు చేస్తారా అని మండిపడ్డారు.తన ఓపికను పరీక్షించొద్దన్న ఆయన పొన్నం ప్రభాకర్ వలనే కాంగ్రెస్ నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు.