కరీంనగర్ పోలీసులకు బండి సంజయ్ కంప్లైంట్
TeluguStop.com
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన ఫోన్ మిస్ అయిందని వెతికి పెట్టాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు.7680006600 నంబర్ గల ఫోన్ మిస్సైందని బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
అయితే టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ఫోన్ ఇవ్వాలని పోలీసులు అడిగిన సంగతి తెలిసిందే.
మరోవైపు తనను అరెస్ట్ చేసినప్పుడు సిద్ధిపేట వెళ్లేంత వరకు ఉన్న ఫోన్ తరువాత పోలీస్ వాహనంలో ఎలా మిస్ అయిందని బండి సంజయ్ ప్రశ్నించారు.
అటు బీఆర్ఎస్ నేతలు టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో బండి సంజయ్ ఫోన్ వ్యవహారం వివాదంగా మారింది.
వైరల్ వీడియో: ఎంతకు తెగించావురా.. కారు బ్యానెట్ పై మనిషి ఉన్నా కానీ..