Bandi Sanjay : రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ బండి సంజయ్ సవాల్ ..!!
TeluguStop.com
కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్,( Ponnam Prabhakar ) బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్ విసిరారు.హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని తెలిపారు.
నిరంతరం ప్రజల కోసం కొట్లాడే తనపై వంద కేసులు ఉన్నాయన్నారు.ఈ క్రమంలోనే ఇతర నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశారా అని ప్రశ్నించారు.
"""/" /
ఇప్పటికే కేటీఆర్( KTR ) తీరుతో బీఆర్ఎస్( BRS ) మునిగిపోయిందన్న బండి సంజయ్ అదే తరహాలో మంత్రి పొన్నం తీరుతో కాంగ్రెస్ కూడా త్వరలో మునిగిపోవడం ఖాయమని విమర్శించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ తెలిపారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైతే మంత్రి పొన్నం రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.