దూకుడు పెంచిన బండి- ప్రచారం షురూ!

పార్లమెంటు ఎన్నికలకు( Parliament Elections ) ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే కరీంనగర్ ఎంపీ, బిజెపి మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు.

కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ కూడా అయిన ఆయన వచ్చే ఎన్నికల్లో తిరిగి కరీంనగర్ నుంచి పోటీ చేయడానికి కేంద్ర పార్టీ అనుమతి కూడా వచ్చేయడంతో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి మళ్లీ బూత్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మార్జిన్ తోనే అయినా అసలు ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించి తిరిగి వార్డ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి నట్టుగా వార్తలు వస్తున్నాయి .

కరీంనగర్ ఎంపీ పరిధిలోని( Karimnagar Parliament ) ఏడు సెగ్మెంట్లలోనూ కార్యకర్తలతో సమావేశమైన బండి త్వరలోనే 20 వేల మందితో భారీ ఎత్తున బహిరంగ సభను ఈ నెలాఖరున ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.

"""/" / ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తిరిగి బండికి ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి పెరుగుతూ ఉండగా మరోసారి తనకు అచ్చి వచ్చిన పార్లమెంట్ స్తానం లో తన ప్రభావాన్ని మరోసారి రుజువు చేసుకోవాలనే గట్టు పట్టదలతో బండి ఉన్నట్లుగా తెలుస్తోంది.

గతంలో వచ్చిన మెజారిటీ కంటే మించి ఈసారి తెచ్చుకుంటే బండిని తిరిగి మరోసారి రాష్ట్ర అధ్యక్షుడు గా చేయడానికి కేంద్ర అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్న అంచనాలు కూడా ఉండడం తో ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో దూసుకుపోవాలంటే ఇప్పటి నుంచే క్రియాశీలకంగా పనిచేయాలని బండి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

"""/" / అందుకే కార్యకర్తలతో సమావేశం అవుతూ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి నుంచే షురూ చేయాలనే ప్రయత్నాలలో బండి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఒక సాదారణ మున్సిపల్ కార్పొరేటర్ స్తాయి నుండి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి( TBJP President ) వరకు ఆయన ప్రయాణం చాలా వేగంగా కొనసాగింది .

అయితే కేంద్ర బిజెపి అనూహ్య నిర్ణయాల తో అధ్యక్ష పదవి పోగొట్టుకున్న ఆయన తిరిగి బారి మెజారిటీ తో కరీంనగర్ పార్లమెంటు స్తానాన్ని చేజిక్కించుకోవడం ద్వారా పది లేచిన కెరటం లా దూసుకెళ్లాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

వైరల్ వీడియో: బైక్ పై రీల్స్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే..?