ఆ పోలీస్ కమిషనర్ పై ‘ బండి ‘ పరువు నష్టం దావా ?

ఆ పోలీస్ కమిషనర్ పై ‘ బండి ‘ పరువు నష్టం దావా ?

పదో తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీ కేసులో అరెస్టు అయ్యి,  ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) మరింత దూకుడు పెంచనున్నారు.

ఆ పోలీస్ కమిషనర్ పై ‘ బండి ‘ పరువు నష్టం దావా ?

  పేపర్ లీకేజీ విషయంలో గతంలో అరెస్ట్ అయిన సంజయ్ ను బిజెపి అగ్ర నేతలు ఫోన్ లో పరామర్శించారు.

ఆ పోలీస్ కమిషనర్ పై ‘ బండి ‘ పరువు నష్టం దావా ?

ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోది( Prime Minister Narendra Modi ) సైతం సంజయ్ ను పరామర్శించి మరింత దూకుడు పెంచాలని ఆదేశించారు .

  ఈ నేపథ్యంలోని పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం విషయంలో తన తప్పు లేకపోయినా,  తనపై అనేక ఆరోపణలు చేయడంతో పాటు,  బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని భావిస్తూ,  వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్( Police Commissioner Ranganath ) పై పరువు నష్టం దావా వేసే ఆలోచనలు బండి సంజయ్ ఉన్నారు.

ఇదే విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో రంగనాథ్ నిరాధార ఆరోపణలపై కోర్టుకు వెళ్లనున్నట్లు సంజయ్ తెలిపారు.

తన హక్కులకు భంగం కలిగించడంతో పాటు,  ఇతర విషయాల పైన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు సంజయ్ తెలిపారు.

"""/" / అంతేకాదు.రంగనాథ్ పై గతంలో వచ్చిన అనేక ఆరోపణలను తాను వెలికి తీస్తానని సంజయ్ ప్రకటించారు.

  ఇప్పటికే రంగనాథ్ పై వచ్చిన ఫిర్యాదులు,  ఆరోపణలను రిపోర్ట్ చేసుకున్నారు.త్వరలోనే మీడియా ముందు వాటిని బయట పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే బండి సంజయ్ అరెస్టుకు సంబంధించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎంపీలు సోయం బాపూరావు,  జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్ లోని స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ ఓం బర్లను కలిసి ఫిర్యాదు నోటును అందజేశారు.

"""/" / పార్లమెంటు సమావేశాల సమయంలో సంజయ్ హక్కులను కరీంనగర్ పోలీసులు కాలరాసారని,  రెండు పేజీల కంప్లైంట్ ను అందించారు.

లోక్ సభ సభ్యుడి హక్కులను కాల రాసినందుకు పోలీసులపై సభా హక్కుల ఉల్లంఘన కింద విచారించాలని వారు విజ్ఞప్తి చేశారు.

పోలీస్ కమిషనర్ రంగనాథ్ తో పాటు,  బీఆర్ఎస్ విషయంలోనూ అధిష్టానం ఆదేశాలతో మరింత దూకుడు ప్రదర్శించాలని సంజయ్ నిర్ణయించుకున్నారు.

మహేష్ బాబు రాజమౌళి సినిమా ఫైట్ సిక్వెన్స్ స్టార్ట్ అయిందా..?