అల్లూరి జిల్లాలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంద్
TeluguStop.com
అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు చింతూరు, వీఆర్ పురం, ఎటపాకతో పాటు కూనవరం మండలాల్లో గిరిజనుల బంద్ సాగుతోంది.
అటు జిల్లాలోని ఎటపాక మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.రోడ్లను బ్లాక్ చేసిన గిరిజన సంఘాల నేతలు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తన పదవికి రాజీనామా చేసి, తమకు మద్ధతు తెలిపాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా బంద్ నేపథ్యంలో షాపులను యాజమానులు స్వచ్ఛందంగా మూసివేయగా.ఈ ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అంటున్న బిగ్ బాస్ షో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?