మడగాస్కర్‌లో భారత రాయబారిగా బండారు విల్సన్ బాబు
TeluguStop.com
సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బండారు విల్సన్‌బాబును మడగాస్కర్‌లో భారత రాయబారిగా నియమించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సోమవారం ప్రకటించింది.
ఈయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
త్వరలోనే ఆయన రాయబారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇప్పటి వరకు మడగాస్కర్‌లో అభయ్ కుమార్ భారత రాయబారిగా విధులు నిర్వర్తించారు.
భారత్- మడగాస్కర్‌లు పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను కలిగి వున్నాయి.ప్రపంచస్థాయిలో ఎన్నో వేదికల మీద భారత్‌కు మడగాస్కర్ అండగా వుంటూ వస్తోంది.
మడగాస్కర్‌లో దాదాపు 17,500 మంది భారతీయులు వున్నారు.వీరిలో 2,500 మంది భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు వున్నారు.
చాలా మంది సొంతంగా వ్యాపారాలను చేస్తూ పలువురికి జీవనోపాధి కల్పిస్తున్నారు.ఇటీవలి కాలంలో అనేక మంది భారతీయ నిపుణులు మడగాస్కర్‌లోని కంపెనీలలో పనిచేస్తున్నారు.
1880 ప్రాంతంలో భారతీయులు తొలిసారిగా మడగాస్కర్ చేరుకున్నారు.వీరిలో గుజరాతీయులే ఎక్కువ.
ఆఫ్రికాలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో నలుగురు మడగాస్కర్‌కు చెందిన వారే, వీరిలో ముగ్గురు భారత సంతతికి చెందిన వారే కావడం విశేషం.
"""/"/
మడగాస్కర్ ఆర్ధికాభివృద్ధిలో భారతీయ సమాజం, డయాస్పోరా పోషించిన పాత్ర మరువలేనిది.వీరిలో చాలా మంది అక్కడి వ్యవస్థలను శాసించగల స్థాయిలో వున్నారు.
ఆ దేశ మొత్తం జీడీపీలో భారతీయ ప్రవాసుల సహకారం గణనీయంగా వుంది.ప్రస్తుత కాలంలో కూడా అనేకమంది భారతీయ నిపుణులు మడగాస్కర్‌కు వలస వెళ్తున్నారు.
ఇటీవలే మడగాస్కర్ రాజధాని అంటనానారివోలో భవ్యమైన హిందూ దేవాలయం భక్తులకు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా.మనదేశం మడగాస్కర్‌కు ప్రధాన వ్యాపార భాగస్వామి.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 400 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
వాణిజ్యంతో పాటు రెండు దేశాల మధ్య అనేక రంగాలలో బలమైన సంబంధాలు వున్నాయి.
ఆరోగ్యం, విద్య, సంస్కృతి, సమాచారం, ప్రయాణం వంటి అంశాలలో భారత్- మడగాస్కర్ మధ్య ఇప్పటికే అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
వైరల్ వీడియో: డ్రోన్ షోలో పిట్టల్లా రాలిన డ్రోన్లు