అండ‌ర్ ఆర్మ్స్ న‌లుపును పోగొట్టే అర‌టి తొక్క‌లు.. ఎలాగంటే?

ఏడాది పొడ‌వుగా ల‌భించే పండ్ల‌లో అర‌టి ఒక‌టి.పైగా వీటి రుచి ఎక్కువ‌.

ధ‌ర త‌క్కువ‌.అందుకే అంద‌రూ అర‌టి పండ్ల‌ను లైక్ చేస్తుంటాయి.

అయితే అర‌టి పండును తిని తొక్క‌ను పారేయ‌డం దాదాపు ప్ర‌తి ఒక్క‌రికీ అల‌వాటే.

అర‌టి తొక్క‌తో ప‌నేంటి, అస‌లు దాంతో ఉప‌యోగాలేంటి.అని అనుకోవ‌డ‌మే అందుకు కార‌ణం.

కానీ, చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.అర‌టి పండు మారిదిగానే తొక్క కూడా మ‌న‌కు అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది ముఖ్యంగా డార్క్ అండ‌ర్ ఆర్మ్స్ తో బాధ‌ప‌డేవారికి అర‌టి తొక్క అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, అండ‌ర్ ఆర్మ్స్ న‌లుపును పోగొట్ట‌డంలో అర‌టి తొక్క‌లు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

మ‌రి ఇంత‌కీ వాటిని ఎలా వినియోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అర‌టి పండును తీసుకుని తొక్క‌ను వేరు చేసి చిన్న చిన్న‌ ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న అర‌టి తొక్క ముక్క‌లు, నాలుగైదు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా పేస్ట్ చేయాలి.

ఇప్పుడు ఈ అర‌టి తొక్క‌ల పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ షుగ‌ర్, హాఫ్ టేబుల్ స్పూన్ ప‌సుపు, రెండు టేబుల్ స్పూన్ల లెమ‌న్ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల వైట్ టూత్ పేస్ట్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

"""/" /g ఈ మిశ్ర‌మాన్ని అండ‌ర్ ఆర్మ్స్‌లో అప్లై చేసి.నిమ్మ చెక్క‌తో సున్నితంగా స్క్ర‌బ్ చేసుకోవాలి.

మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్ర‌బ్బింగ్ చేసుకున్న అనంత‌రం.వాట‌ర్‌తో శుభ్రంగా అండ‌ర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా లోష‌న్‌ను అప్లై చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే న‌లుపు తొల‌గిపోయి అండర్ ఆర్మ్స్ తెల్ల‌గా, మృదువుగా మార‌తాయి.

భర్తతో కలిసి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క.. ఆ నాయకుడికి పోటీగా?