ప్లాస్టిక్ పై నిషేధం అమలు చేయాలి:గ్రీన్ క్లబ్ ట్రస్ట్:

ప్లాస్టిక్ పై నిషేధం అమలు చేయాలి:గ్రీన్ క్లబ్ ట్రస్ట్:

సూర్యాపేట జిల్లా:సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను 2022 వరకు దశలవారీగా పూర్తిగా నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేటితో సంవత్సరం పూర్తి అవుతుందని,దీనికి అనుగుణంగా సూర్యాపేట జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్ అన్నారు.

ప్లాస్టిక్ పై నిషేధం అమలు చేయాలి:గ్రీన్ క్లబ్ ట్రస్ట్:

శుక్రవారం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ప్లాస్టిక్ పై నిషేధం అమలు చేయాలి:గ్రీన్ క్లబ్ ట్రస్ట్:

ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ కార్యదర్శి తోట కిరణ్ తో కలిసి ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సరిగ్గా అమలు చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతూ,చెత్తాచెదారం మరియు నిర్వహణలో లేని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టడానికి జిల్లాలో ఒక నిర్ణీత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ,దిగుమతి,నిల్వ,పంపిణీ,అమ్మకం మరియు వినియోగాన్ని నిషేధించి నేటికీ సంవత్సరం పూర్తి అవుతున్నందున సూర్యాపేట పట్టణంతోపాటు జిల్లాలో ప్లాస్టిక్ వాడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

ప్లాస్టిక్ నిషేధంపై పట్టణంలో మున్సిపల్ సిబ్బందికి గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు ఎప్పుడైనా సహకరించడానికి ముందు ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు బహురోజు ఉపేంద్రాచారి,వనమాల వెంకటేశ్వర్లు,గుండా కిరణ్,అనంతుల సువర్ణలక్ష్మి, సోమ హేమమాలిని,వందనపు శ్రీదేవి,బంగారు పద్మ తదితరులు పాల్గొన్నారు.

హ‌లో అబ్బాయిలు.. జుట్టు ప‌ల్చ‌బ‌డిందా.. వ‌ర్రీ వ‌ద్దు ఇలా చేయండి!

హ‌లో అబ్బాయిలు.. జుట్టు ప‌ల్చ‌బ‌డిందా.. వ‌ర్రీ వ‌ద్దు ఇలా చేయండి!