స్టార్ హీరోయిన్ రష్మికపై బ్యాన్.. ఆ రాష్ట్రంలో ఆమె సినిమాలు రిలీజ్ కావా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మికపై కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ విధించనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రస్తుతం రష్మిక వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.పుష్ప2 సినిమాతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లు, పలు క్రేజీ ప్రాజెక్ట్ లు రష్మిక చేతిలో ఉన్నాయి.
అయితే కన్నడ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా రష్మిక వ్యవహరిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కొన్నిరోజుల క్రితం రిషబ్ శెట్టిపై పరోక్షంగా రష్మిక కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఆ కామెంట్లు రిషబ్ శెట్టి అభిమానులకు చిరాకు తెప్పించడంతో పాటు బాధ పెట్టాయి.
రష్మిక చేసిన వ్యాఖ్యలు హర్ట్ చేసిన నేపథ్యంలో కన్నడిగులు ఆమెపై కోపంగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.
కాంతార మూవీ విషయంలో రష్మిక చేసిన కామెంట్లు సైతం ఆ మూవీ ఫ్యాన్స్ ను బాధ పెట్టాయి.
రష్మిక కావాలనే ఆ సినిమా గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
కన్నడ సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న రష్మిక ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీనే చిన్నచూపు చూస్తోందని మరి కొందరు చెబుతున్నారు.
"""/"/ రష్మిక తాను చేసిన కామెంట్ల విషయంలో క్షమాపణలు చెబితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న రష్మిక కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఫ్యాన్స్ ను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రష్మిక త్వరగా సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.రష్మికపై బ్యాన్ విధిస్తే ప్రస్తుతం ఆమెతో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు సైతం నష్టపోయే ఛాన్స్ ఉంది.
రష్మిక వివాదాల్లో చిక్కుకోవడం ఆమె అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.
కీర్తి సురేష్ ఆంటోని జోడీ క్యూట్ అంటూ కామెంట్లు.. కలకాలం అన్యోన్యంగా ఉండాలంటూ?