పవన్ కళ్యాణ్ వల్లే ఆ సినిమా ప్లాప్ అయిందా..? ఆయన ఎందుకలా చేశాడు…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా సూపర్ హిట్ కావాల్సింది.కానీ అనుకోని కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందనే విషయం మనలో చాలామందికి తెలియదు.
నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరుణాకరన్ దర్శకత్వంలో బాలు అనే సినిమా చేశాడు.
"""/" /
ఇక వీళ్ళ కాంబోలో ఇంతకు ముందే తొలిప్రేమ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే.
అయితే బాలు సినిమాతో( Balu Movie ) కరుణాకరన్ తొలిసారి తన పంథాను మార్చుకొని సినిమా తీయాలనే ఉద్దేశ్యం తో ముందుకు సాగాడు.
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు నడిపించాడు.
ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో కొన్ని సీన్లు అదనంగా ఆడ్ చేయాల్సి ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ కి ఆ సీన్లు నచ్చకపోవడంతో వాటిని మధ్యలో నుంచే తొలగించి వేశారట.
దానివల్లే సినిమా అంత బాగా ఆడలేదు అనే టాక్ అయితే అప్పట్లో విపరీతంగా వచ్చింది.
"""/" /
మరి పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యం తో ఆ సీన్లని తొలగించాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేక పోయింది.
కానీ దర్శకుడు అయిన కరుణాకరన్ కి,( Karunakaran ) పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆ టైంలో వరుసగా ఫ్లాప్ సినిమాలని మూటగట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇక మీదట రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది.
కొత్త కోడలికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు… అమల సంచలన వ్యాఖ్యలు!