Balineni Srinivasa Reddy : తన బాధనంతా వెళ్లగక్కిన ‘ బాలినేని ‘
TeluguStop.com
వైసిపి సీనియర్ నేత, జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పి గానే మారింది.
జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, జగన్ తనను దూరం పెట్టడం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ క్రమంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి, టిడిపిలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీని వీడేది లేదని, టిడిపిలో చేరనని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా ఈ వ్యవహారాలపైన బాలినేని స్పందించారు.తాను ఒంగోలు పేద ప్రజల కోసం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అడిగానని, ఇది తన స్వార్థం కోసం కాదని, కాకపోతే ఇదేదో తన ఇంట్లో కార్యక్రమం మాదిరిగా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని ,పార్టీకి చెడు సంకేతాలు ఇస్తున్నారంటూ బాలినేని వాపోయారు.
ఈ సందర్భంగా జగన్ పైన పరోక్షంగా సెటైర్లు వేశారు.'' నేను సీఎం జగన్ ( CM Jagan )ని ఏదైనా అడిగితే వాసు అడిగాడని అంటున్నారు '' తాను అడిగింది ప్రజల కోసమేనని, అది కూడా గూడులేని పేద ప్రజల కోసమేనని, రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చిన మన పార్టీ, కేవలం 25 వేల మందికి ఇళ్ళు ఇవ్వలేకపోతే ఎలా అని తాను అడిగానని చెబుతున్నారు.
"""/" /
ఒంగోలు నియోజక వర్గంలోని 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే తాను అలిగి హైదరాబాదులో కూర్చున్న అని, దీనిపై సీఎంతో సహా అందరూ తప్పుపట్టారని, వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం ఇంటిలిజెన్స్ అధికారులతో అంటున్నారని వాపోయారు.
ప్రజల్లో జరుగుతున్న చర్చకు సంబంధిన విషయాలు జగన్ కు చెప్పకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అని బాలినేని అన్నారు.
సీఎం దగ్గర అందరు లాగా తాను డబ్బాలు కొట్టనని, కనీసం పొగిడే ప్రయత్నం కూడా చేయనని, ఇలా చేయకపోవడం వల్ల చాలా కోల్పోయానని, అయినా ఇది తనకు ఇష్టమేనని బాలినేని అన్నారు.