చంద్రబాబు పై సీరియస్ కామెంట్ చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి!!
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడి నేపథ్యంలో చంద్రబాబు 36 గంటల పాటు నిర సన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ అదే రీతిలో పోలీసు వ్యవస్థ కుమ్మక్కయి ప్రజాస్వామ్యాని ఖుని చేస్తుందని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్లు ముందుకు రావాలని.
తెలియజేస్తూ చంద్రబాబు దీక్ష చేపట్టారు.కాగా సోమవారం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి కేంద్ర హోంమంత్రికి అదే రీతిలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.
ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు అవ్వడం జరిగింది.ఇటువంటి నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిచంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్న చంద్రబాబు ఏమని ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు.అసలు ఆయన ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం దేవాలయం అని చెప్పే చంద్రబాబు ఆ పార్టీని స్థాపించిన దేవుడు ఎన్టీఆర్ ని చెప్పులతో కొట్టించరని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు చంద్రబాబు చరిత్ర గురించి చెబుతుంటే.మాకే అసహ్యం కలుగుతుంది అని.
ఢిల్లీలో చంద్రబాబు పలకరించే వారే ఎవరూ లేరని బాబు పై సెటైర్లు వేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?