బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
తనపై ప్రణాళికా బద్దంగా కుట్ర జరుగుతోందని స్వయానా రాష్ట్ర మాజీమంత్రి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేకపోయినా అన్ని0టినీ తనకు ఆపాదించే కుట్ర జరుగుతుందన్నారు.ఇందుకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్ధనరావుతో పాటు, సొంత పార్టీలోని కొంతమంది పెద్దలు కూడా పాత్రదారులుగా ఉన్నారన్నారు.
ఈ విషయంపై అధిష్టానానికి ఖచ్చితంగా ఫ్రీయాడు చేస్తానన్నారు.ఇటీవల జనసేన నాయకురాలు విషయం, ఆలూరు మహిళతో పాటు, బంగారు వ్యాపారం వంటి నాలుగు ఘటనల్లోకి తనను అనవసరంగా లాగారని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని.
అంతేకాదు ఈ ఘటనల్లో తన ప్రమేయాన్ని నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.
ఒంగోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నిద్రలేచింది మొదలు తనపై దుష్ప్రచారం ఎలా చేయాలా అని మాత్రమే ఆలోచిస్తుంటారని, ఇందుకోసం తన చుట్టూ కోవేర్థులను నియమించారన్నారు.
ఆ కావర్టులు ఎవరి తెలుసన్నారు.తనను గెలవలేకపోతే రాజయాకీయాల నుంచి తప్పుకోమని కాళ్ళు పట్టుకుంటే తప్పుకుంటానని కంటతడి పెట్టుకున్నారు బాలినేని.
అయితే తాజా సంఘటనలు ప్రేరేపించి తనపేరు లాగేందుకు చాలామంది ప్రయత్నించారని తెలిపారు.ఇందుకు సంబంధించిన కాల్ డేటా సేకరించి జిల్లా ఎస్పీకి అందజేస్తామన్నారు.