చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన.. భరోసా కల్పించనున్న బాలయ్య
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఆందోళనలో ఉన్న కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సిద్ధం అయ్యారని తెలుస్తోంది.
అయితే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఇప్పటివరకు 20 మంది చనిపోయారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను కలిసేందుకు బాలయ్య సిద్ధం అవుతున్నారని సమాచారం.వారందరినీ కలవనున్న బాలయ్య భరోసా కల్పించనున్నారు.
ఈ క్రమంలోనే కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.క్లిష్ట సమయంలో తనకు ఏ అజెండా ఇచ్చిన చేయడానికి రెడీగా ఉన్నానని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆయన చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
నెయ్యితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోండిలా!