గంట పరిచయంతో అతని ఇంటికి వెళ్లిన బాలయ్య బాబు.. నెట్టింట ఫొటోస్ వైరల్?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ ( Balakrishna )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చిన్నపిల్లల నుంచి ఈ పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరు కూడా బాలయ్య బాబుని అభిమానిస్తూ ఉంటారు.
ఇక బాలయ్య బాబు అనగానే చాలామంది కోపిష్టి, గంభీరంగా ఉంటాడు,ఎప్పుడు కోప్పడుతూ చిటపటలాడుతూ ఉంటాడు అని చాలామంది భావిస్తూ ఉంటారు.
కానీ ఆయనను దగ్గర్నుంచి చూసినవారు చెప్పే మాట ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని.
చాలామంది దూరం నుండి చూసి ఆయనతో మాట్లాడాలంటే భయపడతారు కానీ దగ్గరకెళ్లి ఒక మాట కలిపితే చాలు సెటైర్లు, జోక్స్ వేస్తూ కలిసిపోతుంటారని తోటి నటుల నుండి జూనియర్ ఆర్టిస్టుల వరకు పలు సందర్భాల్లో తెలిపారు.
"""/" /
ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
కేవలం ఒక గంట ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి కోసం ఏకంగా అతడి ఇంటి కార్యక్రమానికి వెళ్లి నిజమైన స్నేహితుడయ్యారు మన బాలయ్య.
విమానంలో ప్రయాణించే వారితో మాటలు కలుపుతాము.మహా అయితే దిగిపోయేటప్పుడు ఫోన్ నంబర్లు( Phone Numbers ) మాత్రమే ఎక్స్చేంజ్ అవుతాయి.
అంతటితో మర్చిపోతాం.కానీ బాలయ్య బాబు నిజంగానే అందుకు పూర్తిగా భిన్నం అని చెప్పవచ్చు.
విమాన ప్రయాణంలో తన పక్కన వ్యక్తితో ఏర్పడ్డ గంట పరిచయంతో ఏకంగా అతడిని బాలకృష్ణకు దగ్గర చేసింది.
"""/" /
ఆ పరిచయం స్నేహానికి దారి తీయడంతో పాటు ఆ స్నేహంతోనే సదరు వ్యక్తి ఇంటి గృహ ప్రవేశానికి వెళ్లి తన వామ్ విషెస్ తెలియజేశాడు.
అతడి పేరు హరీష్ వర్మ.ఫ్లైట్ లో ఏర్పడ్డ వీరి పరిచయం, స్నేహంగా మారడంతో బాలకృష్ణను తన గృహ ప్రవేశానికి ఆహ్వానించాడట హరీష్( Harish ).
అతడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.ఈ విషయం తెలిసి అభిమానులు చాలా ఖుషీ అవుతున్నారు.
అదిరా మా బాలయ్య అంటే అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.సదరు స్నేహితుడు హరీష్ ఇంట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది కదరా బాలయ్య అంటే నిజంగానే బాలయ్య మనసు చాలా గొప్పది అంటూ కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.
కెమేరాను మింగేసిన షార్క్.. లోపలి నుండి దృశ్యాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!