NBK107 నుండి భారీ లీక్స్.. ఏకంగా టైటిల్ సాంగ్ క్లిప్ దించేశారు..
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.
సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమాను యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో స్టార్ట్ చేసాడు.
బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకుంది.
వీరిద్దరి సినిమా చేయబోతుండడంతో ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సిరిసిల్ల ప్రాంతంలో పూర్తి చేసుకుంది.తర్వాత నుండి హైదరాబాద్ లోనే మొన్నటి వరకు షూటింగ్ చేసారు.
అయితే ఆ తర్వాత షెడ్యూల్ టర్కీలో ప్లాన్ చేయగా కొన్ని కారణాల వల్ల అక్కడ క్యాన్సిల్ చేసి కర్నూల్ లో ప్రెసెంట్ షూటింగ్ జరుపు కుంటున్నారు.
అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాకు లీక్ రాయుళ్ల వల్ల పెద్ద తలనొప్పి తయారయ్యింది.
ఇప్పటికే షూటింగ్ నుండి ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే బాలయ్య లుక్ లీక్ చేసారు.
దీంతో మేకర్స్ వెంటనే అఫిషియల్ గా బాలయ్య లుక్ రివీల్ చేసారు.ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా నుండి ఫోటోలు మాత్రమే కాదు చిన్నపాటి వీడియో క్లిప్ బయటకు వచ్చింది.
దీంతో టీమ్ అంతా అలెర్ట్ అయ్యారు. """/"/
షూటింగ్ స్పాట్ లో ఉండే కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జై బాలయ్య అంటూ సాగే లిరిక్స్ లో బాలయ్య జనాల మధ్య నుండి ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నడుచుకుంటూ వస్తున్న చిన్న క్లిప్ బయటకు వచ్చింది.
మరి మేకర్స్ ఈ లీక్ రాయుళ్లను ఎలా కనిపెడతారో చూడాలి. """/"/
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.
కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారని తెలుస్తుంది.
ముందు దాసన అని అనుకున్న అప్పటికి షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం లేకపోవడంతో డిసెంబర్ కు రిలీజ్ షిఫ్ట్ చేశారట.