మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన బాలయ్య…

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలందరి కొడుకులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ( Mokshagna ) మాత్రం ఇండస్ట్రీకి ఎప్పుడు వస్తాడు అనే విషయం మీద చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి.

ప్రతి సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు(Balakrishna ) తన అభిమానులకు చెబుతున్నప్పటికీ అది కార్య రూపం దాల్చడం లేదు.

"""/" / ఇక ఇప్పుడు మోక్షజ్ఞ కరెక్ట్ గా హీరో ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ చాలా చక్కటి మెకోవర్లో అద్భుతంగా కనిపిస్తున్నాడు.

కాబట్టి ఆయన హీరోగా మారబోతున్నాడనే వార్తలు కూడా మరోసారి వినిపిస్తున్నాయి.మరి ఆయన హీరోగా వచ్చే సినిమాకి దర్శకుడు ఎవరు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

ఇక మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ తన స్టామినా ఏంటో చూపించుకోవాలని తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే తను డాన్స్, ఫైట్లు, యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

మరి అన్ని అనుకున్నట్టుగా జరిగితే మోక్షజ్ఞ కూడా స్టార్ హీరోగా మారే అవకాశాలైతే ఉన్నాయి అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

"""/" / ఇక ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి బాలకృష్ణ కూతుళ్ళు అయిన బ్రాహ్మిని, తేజస్విని ఇద్దరు కూడా ఆసక్తిని చూపించడం విశేషం.

మొత్తానికైతే ఈ సినిమాతోనే ఆయన భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.ఇక అక్కినేని ఫ్యామిలీలో వచ్చిన వారసుల పరిస్థితి ఎలా ఉందో మనందరం చూస్తున్నాం.

వాళ్ళ మాదిరిగా కాకూడదని ఉద్దేశంతోనే బాలకృష్ణ మోక్షజ్ఞ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటూ వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ మోక్షజ్ఞ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

అయితే డైరెక్టర్ ఎవరూ అనేది తొందర్లోనే ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది.

కన్నప్ప సినిమా రిలీజ్ మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసిందా..?