షకలక శంకర్ కు చుక్కలు చూపించిన బాలయ్య అభిమానులు.. ఏడేళ్ల క్రితం ఏడు చెరువుల నీళ్లు?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్.ఈ షో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇప్పటికి కూడా ఈ షో మంచి ఆదరణతో ప్రసారమవుతుంది.కానీ గతంలో ఈ షో బాగా విమర్శలు ఎదుర్కొంది.

ఇందులో స్కిట్ లో భాగంగా కమెడియన్స్ పర్ఫామెన్స్ చేసి కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తుంటారు.

ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులు ఈ షోపై పలు విమర్శలు చేయడమే కాకుండా తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు కొందరి కమెడియన్స్ పై కూడా పోలీస్ కేసు వేశారు.

అలా ఇప్పటికీ హైపర్ ఆది, షకలక శంకర్, వేణు వండర్స్ వంటి పలువురు కమెడియన్స్ కూడా ప్రేక్షకుల నుండి బాగా విమర్శలు ఎదుర్కొన్నారు.

గతంలో ఈ షోలో కమెడియన్స్ హిందూ మతాల వాళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈ షోను బ్యాన్ చేయాలని బాగా డిమాండ్ చేశారు.

కానీ కమెడియన్స్ మీడియా ముందుకు వచ్చి తమ క్షమాపణలు తెలుపుకొని ఈ షో తమకు ఆదరణ అని చెప్పుకోవడంతో కొన్ని సంఘాలు వాళ్లను వదిలేశాయి.

ఇక కొన్ని అభిమాన సంఘాలు కూడా ఈ షో పై బాగా విమర్శలు చేసింది.

తమ అభిమాన హీరో గురించి తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ స్కిట్ చేయడంతో కొందరు అభిమాన సంఘాలు వచ్చి ఇందులో కమెడియన్స్ పై బాగా ఫైర్ అయ్యారు.

ఇక బాలయ్య అభిమానులు మాత్రం షకలక శంకర్ కు ఏకంగా చుక్కలు చూపించారు.

"""/"/ జబర్దస్త్ షోలో అడుగు పెట్టిన కమెడియన్ శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

దాంతో అతడికి షకలక శంకర్ అనే ఒక గుర్తింపు కూడా వచ్చింది.ఈ షో ద్వారానే వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు.

కెరీర్ మొదట్లో సినీ ఇండస్ట్రీలో పని చేశాడు.ఆ తర్వాత జబర్దస్త్ షో లో చలాకి చంటి టీమ్ లో పని చేశాడు.

ఆ తర్వాత శకలక శంకర్ గుర్తింపుతో తానే టీం లీడర్ గా పని చేస్తున్నాడు.

"""/"/ ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ ను అనుకరించడం వల్ల, పవన్ కళ్యాణ్ అభిమానిగా మరింత క్రేజ్ సంపాదించుకోవడంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక తను నటించిన రాజు గారి గది, ఇంట్లో దెయ్యం నాకేం భయం వంటి సినిమాలు తన పాత్రకు మంచి గుర్తింపు అందించాయి.

ఇక చివరగా మత్తు వదలరా సినిమాలో నటించాడు. """/"/ ఇప్పటికీ జబర్దస్త్ లో కమెడియన్ గా కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళని షకలక శంకర్ కు గత ఏడేళ్ల కిందట బాలయ్య ఫ్యాన్స్ ఏడు చెరువుల నీళ్లు తాపించారనే చెప్పవచ్చు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ఆ సమయంలో షకలక శంకర్ స్కిట్ లో భాగంగా బాలయ్య, రామ్ గోపాల్ వర్మ జరిగిన సంభాషణ ఎలా ఉంటుందో చేసి చూపించాడు.

దీంతో బాలయ్య అభిమానులకు ఈ స్కిట్ అవమానకరంగా ఉండేసరికి షకలక శంకర్ పై అతని టీం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక షకలక శంకర్ చేసేది ఏమీ లేక మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు కోరాడు.

ఇక అప్పటి నుంచి మళ్లీ స్కిట్ లలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

పన్నూన్ హత్యకు కుట్ర కేసు .. భారత్ దర్యాప్తు నివేదికపై వెయిట్ చేస్తున్నాం : అమెరికా