ఇదెక్కడి విచిత్రం.. రెండుసార్లు రిలీజ్ అయిన బాలయ్య మూవీ.. ఏదంటే..??

పాలిటిక్స్‌తో పాటు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు బాలకృష్ణ.బాలయ్య లేకపోతే ఈ రెండు రంగాల్లో నందమూరి ఫ్యామిలీ ఎప్పుడో కనుమరుగయ్యేది.

బాలయ్య సినిమాల్లో అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతోంది.అయినా ఇప్పటికీ ఆయనను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఇటీవల అఖండ, భగవంత్‌ కేసరి సినిమాలతో బాలకృష్ణ బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ సాధించారు.అయితే ఇతడి కెరీర్‌ సక్సెస్‌ఫుల్ మూవీ ‘తాతమ్మకల’తోనే మొదలయ్యింది.

బాలకృష్ణ తొలి సినిమాని ఎన్టీఆర్‌ స్వయంగా డైరెక్ట్ చేశారు.ఆయనే నిర్మించారు కూడా.

ఇందులో బాలకృష్ణతోపాటు హరికృష్ణ సైతం యాక్ట్ చేసి మెప్పించాడు.బాలకృష్ణకు యాక్టింగ్ పట్ల మక్కువ అని ఎన్టీఆర్ చిన్నప్పుడే గమనించారు.

అందుకే ఈ నందమూరి అందగాడికి తగిన క్యారెక్టర్‌ను జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు.‘తాతమ్మకల( Tatamma Kala )’ మూవీలో బాలకృష్ణ రోల్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దానిని ఎన్టీఆర్ చాలా ఆలోచించి సృష్టించారు. """/" / ఇందులో తాతమ్మగా భానుమతి అద్భుతంగా యాక్ట్ చేసింది.

1974, ఆగస్టు 29న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా రిలీజైన 50 రోజులకు ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలను చూపించారని గొడవలు జరిగాయి.

సెన్సార్‌ సమస్యలు సైతం తలెత్తాయి.చివరికి సెన్సార్‌ టీమ్ చేసిన సూచనలకు అనుగుణంగా మూవీలో మార్పులు చేయాల్సి వచ్చింది.

50 రోజులకు ఈ మూవీలో చూపించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడమే అప్పట్లో ఒక వింత.

ఆ సినిమాను బ్యాన్ కూడా చేశారు.సాధారణంగా మూవీ రిలీjaina ఒకట్రెండు రోజుల్లోనే అందులో ఏవైనా అబ్జెక్షన్ ఉంటే గొడవలు చేస్తారు.

కానీ బాలయ్య బాబు మొదటి మూవీ 50 రోజులు ఆడాక అలాంటి గొడవలు అయ్యాయి.

ఈ మూవీ రిలీజయ్యే సమయంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

తక్కువ మంది పిల్లల్నే కనాలని చాలా విజ్ఞప్తి చేసింది.అలా ప్రభుత్వం తిప్పలు పడుతుంటే ఈ సినిమాలో భానుమతి ద్వారా కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా డైలాగులు చెప్పించారు ఎన్టీఆర్.

భూ సంస్కరణలకు సైతం వ్యతిరేకించారు.ప్రభుత్వ విధానాలను క్రిటిసైజ్ చేశారు.

అప్పట్లో దీని గురించి అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. """/" / చివరికి ‘తాతమ్మకల’ సినిమాని రెండు నెలలు బ్యాన్ చేశారు.

అయితే తాను ఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని ఎన్టీఆర్( NTR ) వివరణ ఇచ్చుకున్నారు.

అలాగే కష్టపడి పని చేస్తే ఇలాంటి విధానాలు ఏమీ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనంతరం సినిమాను మరో విధంగా చూపించాలనే కోరికతో కొంతకాలం ప్రదర్శనను నిలిపివేస్తున్నామని చెప్పారు.

ఆపై మూవీలో కొన్ని మార్పులు చేసి 1975, జనవరి 8న విడుదల చేశారు.

ఫస్ట్ టైమ్ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో విడుదలైన ఈ మూవీ రెండోసారి కలర్‌లో రిలీజ్ అయింది.

కథ పాత్రల విషయంలో కొన్ని మార్పులు కూడా కనిపించాయి.

ఈ మధ్యకాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవకుండా ఆగిపోయిన సినిమాలు..!