శ్రీవారితో బాలరాముడు పోటీ.. అయోధ్యలో రికార్డు స్థాయిలో ఆదాయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన తిరుమల శ్రీనివాసుడు( Tirumala Srinivas ) హుండీ ఆదాయానికి అయోధ్యలోని బాలరాముడు( Bala Ramudu ) పోటీ పడుతున్నాడు.

ఈనెల 22న రామమందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగిన సంగతి తెలిసిందే.

ఈనెల 23 న సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు అయోధ్య( Ayodhya )లో రాముల వారిని దర్శించుకుంటున్నారు.

ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ ఇంఛార్జ్ అనిల్ మిశ్రా మాట్లాడారు.

"""/"/ రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత పది విరాళాల కౌంటర్లను ప్రారంభించారు.ఈ ఆలయ కౌంటర్లలో నగదుతో పాటు ఆన్ లైన్క లో భక్తులు విరాళాలు సమర్పించారు.

ఈ క్రమంలో ఒక్కరోజ వచ్చిన నగదు మొత్తం రూ.3 కోట్ల 17 లక్షలని పేర్కొన్నారు.

ఇటు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సరాసరి రోజుకి రూ.3 నుంచి 4 కోట్లుగా ఉంటుంది.

ఈ విధంగా శ్రీవారితో శ్రీరాముడు పోటీ పడ్డాడని తెలుస్తోంది.

వీడియో: టీచర్‌ని అపహరించి.. చివరికి ఏం చేశారో చూడండి..