ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని బతకాల్సిందే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

మహానాడు( Mahanadu )కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.నేడు ఎన్టీఆర్ జయంతి నేపథ్యంలో.

ఆయన గొప్పదనం గురించి మాట్లాడుతూ ఎవరైనా ఆయన పేరు చెప్పుకుని బతకాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్( N.T.

Rama Rao ) గురించి ఎంత చెప్పినా తక్కువేనని వ్యాఖ్యానించారు.రామారావు అంటే నటనకు ప్రతిరూపం, నవరసాలకు ఒక అర్థం, ఒక గ్రంథాలయం, నవ శకానికి ఆరంభం, ఒక జాతికి ఆదర్శం, అగ్ని కణం అని ఆయన కొనియాడారు.

తెలుగు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయుడని బాలకృష్ణ స్పష్టం చేశారు. """/" / ఎవరికి దక్కని మహత్తర జన్మను నందమూరి తారకరామారావు పొందుకున్నారని వ్యాఖ్యానించారు.

సినిమాల్లో అదే విధంగా రాజకీయాల్లో ప్రయోగాలు చేశారని పేర్కొన్నారు.ప్రతి తెలుగు బిడ్డలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ పెట్టి చాలామందికి రాజకీయ బిక్ష పెట్టారని పేర్కొన్నారు.సామాన్యులకు చాలా పథకాలు ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు.

ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలను చెప్పుకుని బతకాల్సిందేనని బాలకృష్ణ( Balakrishna ) "మహానాడు"లో స్వర్గీయ ఎన్టీఆర్ గొప్పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

గేమ్ ఛేంజర్ సినిమాకు భారీ షాక్.. హిట్ టాక్ వచ్చినా ఆ రేంజ్ కలెక్షన్లు కష్టమేనా?