బాలయ్య భార్య హ్యాండ్ లక్కీ హ్యాండా.. ఆమె డబ్బులిస్తే అలా జరుగుతోందా?
TeluguStop.com
బాలకృష్ణ భార్య వసుంధర గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వసుంధర మీడియాకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.
బాలయ్య కోసం పలు సందర్భాలలో రాజకీయ ప్రచారం చేసిన వసుంధర ఆయన విజయానికి కారణమయ్యారు.
అయితే బాలయ్య భార్య హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని ఇండస్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఆమె చేతి నుండి డబ్బులు తీసుకుంటే కలిసొస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.వసుంధర మనస్సు చాలా మంచి మనస్సు అని ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తన వంతు సహాయం చేసే విషయంలో వసుంధర ముందువరసలో ఉంటారని సమాచారం.
బాలయ్య బయటకు వెళ్లాల్సి ఉంటే భార్య కచ్చితంగా ఎదురు రావాల్సిందే అని ఈ సెంటిమెంట్ ను బాలయ్య ఫాలో అవుతారని తెలుస్తోంది.
బాలకృష్ణతో సినిమాలను నిర్మించే నిర్మాతలలో కొందరు ఆమె చేతి నుంచి కొంత డబ్బును తీసుకుని సినిమా నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తారని బోగట్టా.
"""/"/
మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉండగా ఒక సాంగ్ మినహా వీర సింహారెడ్డి షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.
త్వరలో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, ట్రైలర్ గురించి, ఇతర విషయాల గురించి క్లారిటీ రానుంది.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ కాగా వాల్తేరు వీరయ్య మూవీలో ట్రెడిషనల్ గా కనిపించనున్న శృతి హాసన్ వీరసింహారెడ్డి సినిమాలో గ్లామరస్ గా కనిపించనున్నారు.
"""/"/
థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈరోజు ఈ సినిమా నుంచి సుగుణ సుందరి సాంగ్ రిలీజ్ కానుంది.
సంక్రాంతి పోటీ భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఒకే సమయంలో వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి రిలీజ్ కావడం వల్ల నిర్మాతలకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో నష్టమని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
టెర్రస్ పై వర్కౌట్లు చేస్తున్న అనసూయ.. వయస్సు పెరుగుతున్నా గ్లామర్ విషయంలో తగ్గేదేలే!