Balakrishna : బాబాయ్ అని పిలిస్తే దబిడ దిబిడే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎవరికంటే..?
TeluguStop.com
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో నటించారు.
ఈ సినిమా దసరా కానుకగా విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) హీరోయిన్ గా చేస్తే బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీ లీల అదరగొట్టింది.
ఇక ఈ సినిమాలో కాజల్ కంటే శ్రీలీలకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి అని ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి.
అయితే ఈ సినిమా మూడు వారాలపాటు సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవడంతో తాజాగా భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ టీం సక్సెస్ మీట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
"""/" /
ఇక బాలకృష్ణ ఏదైనా స్టేజ్ మీద మాట్లాడితే ఎప్పుడూ ఎలాంటి మాట మాట్లాడతారో అస్సలు ఊహించలేరు ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటల వల్ల అప్పుడప్పుడు ట్రోల్స్ కి కూడా గురైన సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా బాలకృష్ణ భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.నన్ను ఎవరైనా సరే బాబాయ్( Babai ) అని పిలిస్తే ఇప్పటినుండి వారికి దబిడ దిబిడే.
అయినా నేను ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కి బాబాయ్ పాత్రలో చేశాను అంటే ఒక మంచి సందేశాన్ని అందించడం కోసమే.
"""/" /
ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించడం కోసం ఒక ఆర్టిస్టు ఏదైనా గట్టిగా చెబితే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది.
ఇక ఇంతకంటే మంచి మాధ్యమం మరొకటి ఉండదని నా అభిప్రాయం.ఇక ఈ సినిమా కూడా ఎవరో చెబితే నేను చేయలేదు.
నాకు నచ్చే ఈ సినిమాలో చేశాను.అంతేకాదు నా బాధ్యతగా వ్యవహరించి ఈ సినిమాకి ఓకే చెప్పాను అంటూ బాలకృష్ణ భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు ప్రస్తుతం బాలకృష్ణ ( Balakrishna ) మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బాలయ్యకు పద్మభూషణ్…. మరోసారి ఎన్టీఆర్ ను అవమానించిన నందమూరి కుటుంబం?