చిరంజీవికి ఘన స్వాగతం పలికిన బాలయ్య.. చూడటానికి రెండు కళ్లు చాలవంటూ?

ఏపీలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.

అలాగే సోషల్ మీడియాలో వాట్సాప్ యూట్యూబ్ ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా కూడా సంబంధించిన ఫోటోలు వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా సోషల్ మీడియాలో నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే రెండు పదాలు కూడా షేక్ చేస్తున్నాయి.

"""/" / అయితే ఇప్పటికే ప్రమాణం స్వీకారం కార్యక్రమాలు ముగిసిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ వేడుకకు టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇక నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రమాణ స్వీకార సమయంలో అక్కడ ఉన్న సభ మొత్తం అంతా కూడా దద్దరిల్లిపోయేలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నినాదాలతో మారుమోగించారు టిడిపి జనసేన నేతలు.

ఇకపోతే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi) ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా హాజరవ్వడం మరొక ఎత్తు అని చెప్పాలి.

"""/" / మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా టీడీపీ నేతలు జనసేన నేతలు అరుపులతో చిరంజీవికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు.

అనంతరం నందమూరి బాలకృష్ణ చిరంజీవికి ఎదురెళ్లి మరి సాదర స్వాగతం పలికారు.వేదికపైకి చిరంజీవి రాగానే.

ఆప్యాయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు బాలయ్య.కాసేపు నవ్వుతూ ఇద్దరూ ముచ్చటించుకున్నారు.

ఆ విజవల్ మెగా, నందమూరి అభిమానులకు కన్నులపండుగ మూమెంట్ అని చెప్పవచ్చు.చిరంజీవి అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు.

మల్లెపూలు అలంకరణకే కాదు ఇలా కూడా ఉపయోగపడతాయని తెలుసా?