Balakrishna Raviteja: రవితేజ హిట్ సెంటిమెంట్ ను బాలయ్య బ్రేక్ చేయగలరా.. రిజల్ట్ మారుతుందంటూ?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ ఇద్దరు హీరోలు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దసరా పండుగకు కానుకగా విడుదల కానుంది.
దసరా పండుగకు రవితేజ ( Raviteja ) నటిస్తున్న సినిమా కూడా విడుదల కానుంది.
"""/" /
బాలకృష్ణ ( Balakrishna ) సినిమా వస్తోంది కాబట్టి, రవితేజ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు అభిమానులు.
ఈ ఇద్దరు హీరోల మధ్య ఇదో రకం సెంటిమెంట్ ఉంది మరి.ఆ సెంటిమెంట్ ఏంటా అన్న విషయానికి వస్తే.
బాలయ్య బాబు, రవితేజ బాక్సాఫీస్ బరిలో తలపడిన ప్రతిసారి రవితేజనే విజయం సాధిస్తూ వచ్చారు.
కాగా 2008 లో బాలకృష్ణ, రవితేజ సినిమాలు ఒకేసారి థియేటర్ లో విడుదల అయ్యాయి.
రవితేజ నటించిన కృష్ణ, బాలకృష్ణ చేసిన ఒక్క మగాడు సినిమాల్లో కృష్ణ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది.
తర్వాత 2009లో కూడా ఇదే రిపీట్ అయ్యింది.2009లో మిత్రుడు కిక్ సినిమాలు విడుదల కాగా కిక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
"""/" /
ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య బాబు రవితేజ తలపడిన ప్రతిసారి కూడా రవితేజనే విజయం సాధిస్తూ వచ్చారు.
చివరగా ఈ ఇద్దరు హీరోలు 2011లో ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు.దాదాపుగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నారు.
బాలకృష్ణ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా అలాగే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమా ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి దసరా పండగ కానుకగా విడుదల కానున్నాయి.
ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈసారి కూడా రవితేజ తప్పకుండా హిట్ సాధిస్తాడని చెప్పవచ్చు.