విజయ్ దేవరకొండ మూవీలో బాలయ్య.. ఆ సినిమాతో బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి( Gautham Tinnanuri ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

సినిమా టైటిల్‌ ను అతి త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇదే సమయంలో సినిమా వంద కోట్లకు పైగా బడ్జెట్‌ క్రాస్ చేయడంతో పాటు, కథను సింగిల్‌ పార్ట్‌ లో చెప్పడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో రెండు పార్ట్‌ లుగా తీసుకురావాలని గౌతమ్‌ తిన్ననూరి భావిస్తున్నాడట.

ఆ విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. """/" / ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రెండు పార్ట్‌ లుగా వస్తున్న కారణంగా ఈ సినిమాను సైతం అదే విధంగా రెండు పార్ట్‌ లుగా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే సినిమా టీజర్‌ ను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

టీజర్‌ తో టైటిల్‌ ను రివీల్‌ చేయడంతో పాటు సింగిల్‌ పార్ట్‌ గానే సినిమా రాబోతుందా లేదంటే రెండు పార్ట్‌ లుగా విడుదల చేస్తారా అనే విషయాలపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.

అదే విధంగా విడుదల తేదీ విషయంలోనూ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మొత్తానికి టీజర్‌పై చాలా ఆసక్తి నెలకొంది.ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ని రివీల్‌ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.

"""/" / బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమా నిర్మాత, విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న సినిమా నిర్మాత ఒక్కరే కావడంతో పాటు, విజయ్‌ దేవరకొండకి బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆ కారణంతో బాలకృష్ణతో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించే అవకాశాలు ఉన్నాయి.టీజర్‌ లో వాయిస్‌ ఓవర్‌ కోసం స్వయంగా విజయ్‌ దేవరకొండ బాలకృష్ణ తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో యంగ్‌ హీరోల సినిమాల ఫంక్షన్స్‌ కి బాలయ్య ఎక్కువగా హాజరు అవుతున్నారు.

అదే విధంగా వారితో సన్నిహితంగా ఉంటూ వారి సినిమాల కోసం తన వంతు సహకారం అందిస్తున్నారు.

కనుక విజయ్ దేవరకొండ సినిమా కోసం బాలయ్య మాట సాయం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో టీజర్‌లో బాలకృష్ణ వాయిస్ ఓవర్‌ ఉంటే కచ్చితంగా అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

నా జీవితంలో దానికి తావు లేదు.. హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!