ఇది కదా బాలయ్య స్టామినా.. అన్ స్టాపబుల్ రికార్డ్..!

నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా ఓటీటీలో చేసిన టాక్ షో అన్ స్టాపబుల్.ఈ షోతో బాలకృష్ణ ఇంకాస్త ప్రేక్షకులకు దగ్గరయ్యారని చెప్పొచ్చు.

బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ఆహా టాక్ షోస్ లోనే అత్యధిక ప్లేస్ అయిన షోగా రికార్డ్ సాధించింది.

అన్ స్టాపబుల్ షో 4 మిలియన్ ప్లేస్ తో సక్సెస్ ఫుల్ అయ్యింది.

ఆహా లో ఇదివరకు కూడా టాక్ షోలు రాగా బాలకృష్ణ టాక్ షో రికార్డ్ సృష్టించిందని చెప్పొచ్చు.

ఇంతకుముందు ఆహా కోసం సమంత సామ్ జామ్ షో చేసింది.ఆ షోకి మాములు ప్లే వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది.

బాలకృష్ణ మొదటిసారి ఇలా రియాలిటీ షో చేయడం.బాలయ్య బాబు ప్రేక్షకులకు ఇలా దగ్గరవడం ఇలా రెండు కారణాల వల్ల అన్ స్టాపబుల్ షోకి బాగా క్రేజ్ వచ్చింది.

షో మొదలు కాకముందే వచ్చిన ప్రోమోతోనే సూపర్ అనిపించారు బాలయ్య.ఇక ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో థర్డ్ ఎపిసోడ్ కు సిద్ధం చేస్తున్నారు.

ఈసారి బ్రహ్మానందం గెస్ట్ గా వస్తారని టాక్.ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా గెస్ట్ గా వచ్చి అలరిస్తాడని తెలుస్తుంది.

రాత్రి సమయంలో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?