బాలయ్య.. మహేష్.. అన్ స్టాపబుల్ ప్రోమో అదుర్స్..!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది.

ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ అటెండ్ అయ్యారు బాలయ్య, మహేష్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ హంగామా వేరేలా ఉంటుంది.

అలాంటి ఓ అద్భుతమైన కాంబో ఆహా అన్ స్టాపబుల్ షో సెట్ చేసింది.

హోస్ట్ గా బాలయ్య సూపర్ ఫాం లో ఉన్న అన్ స్టాపబుల్ షోకి మహేష్ గెస్ట్ గా వచ్చారు.

ఈ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది.ఈ ఎపిసోడ్ లో మహేష్ తో బాలయ్య పంచులు.

మహేష్ సెన్సార్ హ్యూమర్ గురించి బాలయ్య కామెడీ ఇలా సరదా సరదాగా సాగింది.

మహేష్ చేస్తున్న హార్ట్ సర్జరీల గురించి బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు.గౌతం ఆరు వారాల ముందు పుట్టినప్పుడు తనలో వచ్చిన మార్పే తను ఈరోజు చేస్తున్న పనికి శ్రీకారం చుట్టిందని అన్నారు మహేష్.

షో అంతా ఎంతో ఫన్నీగా సాగిందని ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది.షోలో భాగంగా డైరక్టర్ వంశీ పైడిపల్లి కూడా వచ్చారు.

అఖండ చూశాక మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది సర్ అని అన్నాడు.దేవుడి గురించి బాలయ్య చెప్పిన డైలాగ్ కి మహేష్ పంచ్ వేశాడు.

ఏమ్మా మీలో ఎవరైనా దేవున్ని చూస్తారా అని బాలయ్యపై పంచ్ వేస్తాడు.బాలకృష్ణ కూడా దాన్ని ఎంజాయ్ చేశారు.

ఇక ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి మొదటి శుక్రవారం అంటే ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కానుంది.

తెలంగాణ :  ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనా ?