అఘోరాగా చేస్తున్నప్పుడు సెట్లో బాలయ్య ఎలా ఉండేవాడో చెప్పిన సీనియర్ నటుడు..

తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లోనూ దుమ్మురేపుతుంది బాలయ్య నటించిన అఖండ సినిమా.

అద్భుత జనాదరణతో ముందుకుసాగుతుంది.బోయపాటి, బాలయ్య కాంబో మరోసారి సూపర్, డూపర్ సక్సెస్ అయ్యింది.

బాలయ్య నటన సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది అని చెప్తున్నారు.అయితే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రపై ప్రశంసల జల్లు కురుస్తుంది.

ఆయన నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉందంటున్నారు జనాలు.ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు మరెవరో కాదు కోటేశ్వరరావు.100కు పైగా సినిమాల్లో నటించాడు.

అఖండ సినిమాలోనూ అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు.తాజాగా ఆయన ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించాడు.

ప్రస్తుతం తాను అఖండ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు.ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి పలు విషయాలు వెల్లడించాడు.

సెట్ లో బాలయ్యను అఘోరా గెటప్ లో చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు.ఆయన రూపం చూసి వారెవ్వా అనుకున్నట్లు వెల్లడించాడు.

సాధారణంగా బాలయ్య ఏ పాత్ర చేసినా సెట్లో అందరితో చాలా సరదాగా ఉంటాడని చెప్పాడు.

ఆయనకి స్నాక్స్ వస్తే మాకు ఇచ్చేవారని చెప్పాడు. """/" / అయితే అఖండ సినిమాలో అఘోర పాత్ర చేస్తున్నప్పుడు మాత్రం సెట్లో ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని వెల్లడించాడు.

డైరెక్షన్ వాళ్లు పిలిస్తే తప్ప.ఎవరి దగ్గరికి వెళ్లేవాడు కాదని చెప్పాడు.

ఎప్పుడు చూసినా తను ఆ పాత్రలోనే లీనమై ఉండేవాడని చెప్పారు.ఈ సినిమాలో గొడ్డళ్లతో ఓ యాక్షన్ సీన్ ఉంటుందని చెప్పాడు.

గొడ్డలిని నోటితో పట్టుకునే సన్నివేశంలో బాలయ్య కాలు స్లిప్ అయినట్లు చెప్పాడు.వెంటనే గొడ్డలి కాలుమీద పడి బాగా వాచినట్లు చెప్పాడు.

తర్వాత రోజు షూటింగ్ ఉంటుందో? లేదో? అనుకున్నట్లు చెప్పాడు.కానీ మరుసటి రోజు ఉదయాన్నే తను సెట్లోకి వచ్చినట్లు చెప్పాడు.

గుడి సీన్ చేస్తున్నప్పుడు ఎండలో కాళ్లు కాలినా ఆయన చెప్పులు వేసుకోలేదని వెల్లడించాడు.

చిన్నపిల్లని కాల్చేసిన యూఎస్ మహిళ.. షాకింగ్ వీడియో వైరల్..