Balakrishna : భగవంత్ కేసరికి బాలయ్య ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారో తెలుసా?

టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి మనందరికీ తెలిసిందే.బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఈ మధ్యకాలంలో బాలయ్య బాబు నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి.

గత ఏడాది విడుదలైన అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

అలాగే ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడి బాలయ్య బాబు కాంబినేషన్ లో విడుదల అయినా భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సూపర్ హిట్ గా నిలిచింది.

"""/" / భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు తియేటర్లో సక్సెస్ఫుల్గా రాణిస్తూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, శ్రీలీల( Sreeleela ) బాలయ్య కూతురిగా నటించింది.

థమన్ సంగీతం అందించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మించారు.

ఇతర కీలకపాత్రల్లో ప్రియాంక జవాల్కర్, అర్జున్ రామ్ పాల్( Arjun Rampal ) ఇందులో కనిపించారు.

ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.అటు బాలయ్యకు, శ్రీలీల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

"""/" / కాగా ఈ సినిమాలో నటించినందుకు అటు బాలయ్య, ఇటు శ్రీలీల భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం బాలయ్య 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌( Balakrishna Remuneration ) అందుకున్నట్లు తెలుస్తోంది.

కాజల్ ఒకప్పుడు రెండు కోట్ల వరకు పారితోషికం దక్కించుకుంది.కానీ ఈ మధ్య కాలంలో ఆమెకి క్రేజ్‌ తగ్గింది.

ఇక ఈ సినిమాకు ఆమె 80 లక్షలు పారితోషికం అందుకుంది అంటున్నారు.ఇక శ్రీ లీల ఏకంగా రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుందని తెలుస్తోంది.