వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు..!! TeluguStop.com
హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( MLA Nandamuri Balakrishna ) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.
మంగళవారం ఎమ్మిగనూరు సభలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా రాయలసీమకు తాగు, సాగు నీరు అందించిన అభినవ భగీరధుడు చంద్రబాబు( Chandrababu ) అని వ్యాఖ్యానించారు.
మహిళలలో ఆర్థిక విప్లవం తెచ్చారు.రాష్ట్రంలో సుపరిపాలన కావాలో.
విధ్వంసం కావాలో ప్రజలే తేల్చుకోవాలి.వైసీపీని( YCP ) ఓటుతో పొడిచి అపజయం రుచి చూపించాలని పిలుపునిచ్చారు.
ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు.10 లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధికి ఆమడ దూరంలోకి నెట్టేశారు.
"""/" /
ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అది ఒక చంద్రబాబుతోనే సాధ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు.
మా కూటమి ఎదుట ఇప్పుడు ఏ శక్తి నిలవలేదని అన్నారు.జగన్ కు( Jagan ) ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు.
ఓటమి భయంతోనే రాళ్ళ డ్రామాలకు తెరలేపేరని విమర్శించారు.నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరిట.
రాయలసీమలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.రాయలసీమలో బాలకృష్ణకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దీంతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి జనాలు భారీ ఎత్తున హాజరవుతున్నారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉంది.
దీంతో ప్రధాన పార్టీల నేతలు భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
విధిరాతను అధిగమించి పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని.. బాలయ్య చేసిన పనికి ఫిదా!