అల్లు శిరీష్ నా కుర్చీకే ఎసరు పెట్టాడు.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు?
TeluguStop.com
స్టార్ హీరో బాలకృష్ణ నిజ జీవితంలో సరదాగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.
ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బాలకృష్ణ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రైలర్ బాగుందని నాకు కూడా ఇలాంటి సినిమాలలో నటించాలని ఉన్నా పరిమితులు ఉన్నాయని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఫ్యాన్స్ కు నచ్చని సినిమాలను వాళ్లపై రుద్దాలని నేను అనుకోనని బాలయ్య కామెంట్లు చేశారు.
నా సినీ కెరీర్ ఎప్పుడు మొదలైందో గీతా ఆర్ట్స్ కూడా అప్పుడే మొదలైందని బాలయ్య పేర్కొన్నారు.
అల్లు రామలింగయ్య గారితో చాలా సినిమాలు చేశానని బాలయ్య అన్నారు.అల్లు శిరీష్ గురించి చాలా విషయాలు విన్నానని అల్లు శిరీష్ నా కుర్చీకి ఎసరు పెట్టే ప్రయత్నం చేశాడని బాలయ్య చెప్పుకొచ్చారు.