కొడుకు విషయంలో మళ్లీ అదే మాట చెప్పిన బాలకృష్ణ

నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా గత నాలుగు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే కారణం ఏంటో కాని వరుసగా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.

మోక్షజ్ఞకు హీరో అయ్యేంత వయసు రాలేదంటూ నందమూరి ఫ్యామిలీ మెంబర్స్‌ చెబుతున్నారు.కాని మోక్షజ్ఞ వయసు మూడేళ్ల క్రితమే రెండు పదుల వయసు దాటింది.

అయినా కూడా ఇంకా ఎందుకు ఆపేస్తున్నారు అనే విషయమై క్లారిటీ రావడం లేదు.

మోక్షజ్ఞ ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే విషయంపై కూడా క్లారిటీ లేదు.ఎందుకంటే చాలా రోజులుగా మోక్షజ్ఞ ఫొటోలు మీడియాలో కనిపించలేదు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అంటూ తాజాగా ఎన్టీఆర్‌ మహానాయకుడు మూవీ విడుదల సందర్బంగా బాలకృష్ణను మీడియా వారు అడిగిన సమయంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఖచ్చితంగా మోక్షజ్ఞ మూవీ ఉంటుందని చెప్పాడు.

గత మూడు నాలుగు ఏళ్లుగా బాలకృష్ణ వచ్చే ఏడాది అంటూ చెబుతూ వస్తున్నాడు.

ఎందుకు కొడుకు సినిమాను ఇంతగా వాయిదాలు వేస్తున్నాడు అనే విషయం తెలియడం లేదు.

మోక్షజ్ఞ లావు తగ్గడం కోసం సమయం తీసుకుంటున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తుంటే మరి కొందరు మాత్రం మోక్షజ్ఞ పై అంచనాలు భారీగా పెంచేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ నందమూరి హీరోలు ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో మోక్షజ్ఞ కూడా యంగ్‌ స్టార్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా స్టార్‌డంను దక్కించుకుంటాడని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

కాని పరిస్థితి చూస్తుంటే మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి బాలకృష్ణ భయపడుతున్నట్లుగా అనిపిస్తుంది.పూర్తిగా సంసిద్దం అయిన తర్వాతే బాలయ్య తన కొడుకును రంగప్రవేశం చేయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ లీక్ వెనుక ఉన్నది వాళ్లేనా.. అడిగిన డబ్బు ఇవ్వలేదనే అలా చేశారా?