రూలర్ మొదటి రోజు కలెక్షన్లు

నందమూరి నటసింహం, టాలీవుడ్ లెజెండ్ బాలయ్య బాబు నటించిన రూలర్ చిత్రం భారీ అంచనాల నడుమ నిన్నటి రోజున విడుదల అయింది.

అయితే ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు కె.ఎస్.

రవికుమార్ దర్శకత్వం వహించగా బాలయ్య బాబు సరసన సోనాల్ చౌహాన్ వేదిక నటించారు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

ట్రైలర్ తో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం  విడుదలయిన తర్వాత పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకెళుతోంది.

  ఈ చిత్రానికి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించాయి.అయితే మరోపక్క సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండుగ సినిమాతో మంచి పోటీ ఇస్తుండటంతో  రూలర్ చిత్ర వసూళ్లకు కొంతమేర గండి పడినట్లు తెలుస్తోంది.

అయితే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.29 కోట్ల రూపాయలు ఈ చిత్రం వసూలు చేసింది.

"""/"/   తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల వారీగా రూలర్ చిత్రం కలెక్షన్లను పరిశీలించినట్లైయితే నైజాం - 0.

68కోట్లు, సీడెడ్ -1.08కోట్లు, ఉత్తరాంధ్రలో 0.

28కోట్లు, ఈస్ట్ గోదావరి 0.27 కోట్లు, వెస్ట్  గోదావరి 0.

26 కోట్లు, గుంటూరు - 1.30 కోట్లు, క్రిష్ణ - 0.

20 కోట్లు, నెల్లూరు - 0.22కోట్లు, గా నమోదయ్యాయి.

ఇందులో అత్యధికంగా గుంటూరులో బాలయ్య తిరుగు లేకూండా దూసుకుపోతున్నాడు. .

ఆడవారికి బెస్ట్ ప్రోటీన్ పౌడర్.‌. రోజుకో స్పూన్ తీసుకుంటే అంతులేని ప్ర‌యోజ‌నాలు!