రూలర్ క్లోజింగ్ బిజినెస్.. డిజాస్టర్‌కు కేరాఫ్!

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ మంచి అంచనాల నడుమ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమాలో బాలయ్య నుండి ఆశించే అంశాలు ఏమీ లేకపోవడంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.

దీంతో తొలిరోజే ఈ సినిమాకు దారుణమైన టాక్ రావడం, కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా దారుణమైన వసూళ్లు సాధించడంతో ఫ్లాప్ చిత్రంగా మిగిలింది.

తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ చాలా ఆగ్రహానికి గురయ్యారు.

ఈ కథలో ఏముందని బాలయ్య ఈ సినిమా చేశారో వారికే తెలియని అయోమయంలో పడిపోయారు.

బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ అందించిన మ్యూజిక్‌కు ఒక్కటంటే ఒక్కపాట కూడా కలిసిరాకపోవడం, హీరోయిన్లలలో ఒక్క సోనాల్ చౌహాన్ తప్ప వేదిక వేస్టు అంటూ రివ్యూలలలో తమ అసహనాన్ని వెల్లగక్కారు సినీ క్రిటిక్స్.

ఏదేమైనా బాలయ్య కెరీర్‌లో మరో డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలవడంతో నందమూరి ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనయ్యారు.

ఇప్పుడు బోయపాటితో చేయబోయే సినిమాతో బాలయ్య మళ్లీ ఫాం లోకి రావాలని వారు కోరుకుంటున్నారు.

కాగా రూలర్ సినిమాకు సంబంధించిన ప్రపంచవ్యాప్త క్లోజింగ్ బిజినెస్ ఈ విధంగా ఉంది.

నైజాం - 1.35 కోట్లు సీడెడ్ - 1.

95 కోట్లు నెల్లూరు - 0.36 కోట్లు కృష్ణా - 0.

41 కోట్లు గుంటూరు - 1.35 కోట్లు వైజాగ్ - 0.

50 కోట్లు ఈస్ట్ - 0.40 కోట్లు వెస్ట్ - 0.

40 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 6.72 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 0.

50 కోట్లు ఓవర్సీస్ - 0.34 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 7.

56 కోట్లు.