ఇలాగైతే బాలయ్య మూవీకి పబ్లిసిటీ ఖర్చులు అయినా వచ్చేనా?

నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్‌' చిత్రం మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నేడు ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను వైజాగ్‌లో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.

ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ సినిమా రూపొందింది.ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడ్డ తర్వాత కూడా ఇంకా ఏమాత్రం ప్రచారం చేయడం లేదు.

సాదారణంగా బాలయ్య సినిమాకు భారీ ప్రమోషన్‌ చేస్తేనే ఓపెనింగ్స్‌ రెండు మూడు కోట్ల వరకు రావడం కష్టం.

అలాంటిది ప్రచారం చేయకుంటే పరిస్థితి ఏంటీ అంటూ సినీ జనాలు ప్రశ్నిస్తున్నరు. """/"/రూలర్‌ సినిమాను నిర్మాత 20 కోట్ల నష్టంతో విడుదల చేయబోతున్నాడు.

అంటే దాదాపుగా పాతిక కోట్లు పెట్టి నిర్మిస్తే సినిమా కనీసం 5 కోట్లకు కూడా అమ్ముడు పోలేదట.

అయినా కూడా నిర్మాత సి కళ్యాణ్‌ చాలా నమ్మకంతో సినిమాను సొంతంగా విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు.

బాలయ్య కెరీర్‌లోనే ఇదో దారుణమైన మార్కెట్‌ చేసిన సినిమా అంటూ ఇప్పటికే ఒక రికార్డును ఈ చిత్రం దక్కించుకుంది.

ఇక పబ్లిసిటీ లేకుండా సినిమా వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందో అనే అనుమానాలు అంతా వ్యక్తం చేస్తున్నారు.

"""/"/విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ఈ సినిమాకు లో ఫ్రొఫైల్‌ మెయింటెన్‌ చేయాలని భావించాడు.

కాని విడుదల ముందు కూడా అలాగే ఉంటే జనాలకు రూలర్‌ గురించి తెలియక థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఉండదని, పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నాలుగు రోజులు అయినా కాస్త సందడి చేయకుంటే మరింత నష్టం తప్పదంటూ సినీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.

కడప ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రినవుతా  ..ఇంకా షర్మిల ఏమన్నారంటే ..?