ఆదివారం వస్తే బాలయ్య ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా… ఆ పని అస్సలు చేయరా?
TeluguStop.com
నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డాకు మహారాజ్( Daku Maharaj ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం యాంకర్ సుమతో( Suma ) ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
అయితే, బాలయ్యకు సండేతో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ గురించి కూడా బయటపెట్టారు.సాధారణంగా బాలకృష్ణ ఇలాంటి ఎన్నో రకాల సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు అనే విషయం మనకు తెలిసిందే.
అయితే ఆదివారం( Sunday ) అంటే కూడా బాలయ్యకు ఒక సెంటిమెంట్ ఉందని ఆ రోజు పొరపాటున కూడా ఆయన కొన్ని పనులను చేయరని ఈ సందర్భంగా బయటపెట్టారు మరి ఆదివారంతో బాలయ్యకు ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ ఏంటనే విషయాన్ని వస్తే.
ఆదివారం వస్తే బాలకృష్ణ పొరపాటున కూడా నలుపు రంగు ( Black Colour ) దుస్తులను ధరించరట.
పొరపాటున నలుపు రంగు దుస్తులు ధరిస్తే ఆ రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని బాలయ్య ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.
"""/" /
ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్.ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం.
నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో ఇప్పటికి దానిని అలాగే పాటిస్తూ ఉన్నానని తెలియజేశారు.
ఆదివారం ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను.అందుకే ఆదివారం నలుపు రంగు దుస్తులకు పూర్తిగా దూరంగా ఉంటానని తెలిపారు.
అయితే ఓసారి ఆదిత్య 36 సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ చెప్పడంతోనే నేను నలుపు రంగు దుస్తులు ధరించానని తెలిపారు.
"""/" /
నలుపు రంగు దుస్తులు ఇచ్చినప్పటికీ వద్దని నేను చెప్పాను కానీ డైరెక్టర్లు చెప్పడంతో వేసుకోక తప్పలేదు.
అయితే అదే రోజు సినిమా షూటింగ్లోకి రాకరాక బాలసుబ్రమణ్యం గారు కూడా వచ్చారు.
అయితే ఆయన చూస్తుండగానే ఒకసారిగా నేను కింద పడిపోయి నా నడుం విరిగింది.
అందరూ బాలసుబ్రమణ్యం గారు రావడం వల్ల అలా జరిగిందని అన్నారు దీంతో ఆయన మరోసారి ఆ ప్రాంతంలో కనిపించలేదు.
నేను మాత్రం నలుపు రంగు దుస్తులు వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని భావించాను.
అందుకే ఆదివారం పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించినని బాలకృష్ణ తెలిపారు.
.
సిగ్గుచేటు! లారీ బోల్తా.. టైల్స్ కోసం ఎగబడ్డ జనం! డ్రైవర్ సంగతి మరిచిపోయారు!!